
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు రేపు జరగనున్నాయని పూజారి జండా వెంకటేష్ శర్మ తెలిపారు.
రేపు ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, అలంకరణ, సాయంకాలం హోమం, డోలోత్సవం, అనంతరం అన్నదానం..పౌర్ణమి రోజు సాయంకాలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం ఊరేగింపు జరుగునుందని చెప్పారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు.