
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా సోదాలు నిర్వహించడం, అనంతరం అక్రమ కేసులు పెట్టడంపై నిజామాబాద్ జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాలు, యూనియన్ లు తీవ్రంగా ఖండిస్తున్నాయని జర్నలిస్టులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితమైన విధానాన్ని కొనసాగిస్తుందని, పత్రికా స్వేచ్ఛపై ఉక్కు పాదం మోపడం సరైనది కాదన్నారు. దీనిని జిల్లాలోని అన్ని జర్నలిస్టుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. వెంటనే కక్ష సాధింపు చర్యలను నిలిపివేయాలని, ప్రజాస్వామ్యంలో మీడియాపై వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు.
ప్రజా సంక్షేమం కోసం హక్కుల కోసం ప్రజల పక్షాన గత కొన్నేళ్లుగా బాధ్యతాయుతంగా రెండు రాష్ట్రాల్లో నిరంతరం కృషి చేస్తున్న సాక్షి దినపత్రిక పై ఇలాంటి కక్ష సాధింపు చర్యలు శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.