
ఆర్మూర్ పట్టణంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దుల గుట్టపై గల శ్రీ నవనాథ సిద్దేశ్వర దేవాలయంపై నూతనంగా నిర్మించిన పూజ స్టోర్ పై వచ్చిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని, అవి అవాస్తవమని ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. గత 15 నెలల నుండి దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలు కల్పించామన్నారు.
శ్రీ నవనాథ సిద్దేశ్వర దేవాలయం అభివృద్ధికి కమిటీ అహర్నిశలు కృషి చేస్తుందని కమిటీ సభ్యులు చరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కొంత మురళి తదితరులు పాల్గొన్నారు.