
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విశాఖ నగర్ కాలనీవాసులు, పరిసర ప్రాంతాల కాలనీవాసులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి సమిష్టిగా “భారతీయ సైనికులకు సంఘీభావ ర్యాలీ” నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయులంతా ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను ఖండించాలని కోరారు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి విశాఖ కాలనీ వీధి గుండా పెర్కిట్ చౌరస్తా మీదుగా ర్యాలీని నిర్వహించారు.