
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని TUCI జిల్లా అధ్యక్షుడు ముత్తన్న, ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఆర్మూర్ పట్టణంలో ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) పోస్టర్లను ఆవిష్కరించారు. గత 11 ఏళ్లలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని, కార్మికులకు ఉద్యోగ & ఆరోగ్య భద్రత కరువైందని అన్నారు. 20న జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు.