
ఈఏపి సెట్ 2025 లో ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలలో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం… విద్యార్థులను అభినందించిన క్షత్రియ సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్…
ఈరోజు ప్రకటించిన జె.ఎన్.టి.యు ఈఏపి సెట్ – 2025 పరీక్ష ఫలితాలలో క్షత్రియ విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలలో మంచి ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో కే వివేక్ రెడ్డి హెచ్. టి నెం. 2525సి01412, 1813 ర్యాంక్ మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో బి. హరి వర్దిని హెచ్. టి. నెం. 251ఎల్05029, 3724 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ర్యాంకులు సాధించిన మరియు క్వాలిఫై అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈఏపి సెట్ 2025 లో క్షత్రియ విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లలో చాలామంది ర్యాంకులు మరియు క్వాలిఫై అయ్యారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రెటరీ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మరియు అధ్యాపక బృందం సన్మానించి అభినందించారు.