భీంగల్ పట్టణంలో శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వైశాఖం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారి యొక్క పెద్ద గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
స్వామి వారికి విశేష పూల అలంకరణ, ఆభరణాల అలంకరణతో సన్నాయి చెప్పులతో పూజారులు మరియు వేద పండితులు పార్థసారథి, విజయ సారధి వాసం నారాయణ చేతులు మీదుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడింది.