
నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్ హనుమాన్ మందిరంలో “మనం సైతం దేశం కోసం” కార్యక్రమంలో భాగంగా సరిహద్దుల వద్ద పోరాడుతున్న సైనికులకు విజయం, ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ మందిరంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి లతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.