
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నుండి 25/5/ 2025 వరకు ఈ వేసవి శిక్షణ తరగతులు ఉంటాయని ఈ శిక్షణ తరగతులు 6 తరగతి నుండి 9వ తరగతి 100 మంది విద్యార్థులకు 15 రోజుల సమ్మర్ క్యాంప్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సిరికొండ ఎంఈఓ రాములు తెలిపారు.
జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించిన అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు డ్యాన్స్, కరాటే, యోగ, ఎంబ్రాయిడింగ్, సెల్ఫ్ డిపెండ్స్ వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నేర్చుకుంటారాని, శిక్షణ మధ్యలో స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిరికొండ హెడ్మాస్టర్ సతీష్ గౌడ్, డ్యాన్స్ మాస్టర్, కరాటే మాస్టర్, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.