
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని సర్వ సమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమన్ తెలిపారు.
ఆలయ పూజారి జెండా వెంకటేష్ శర్మ మాట్లాడుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఇవాళ సాయంత్రం హోమం, డోలోత్సవం జరగనుందన్నారు.
భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొనాలని సర్వ సమాజ్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.