
ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని విశాఖ కాలనీలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని మూడవ ఆదివారం నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నేడు మా సంస్థ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆలయం చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న చెత్తను తొలగించామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లిక్కి గంగాధర్, హరి ప్రసాద్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకే నిశాంత్, రాజ్ కుమార్, సాయికిరణ్, భోజన్న, మధుసూదన్, బొగడ మీది గంగారెడ్డి, లక్ష్మీనరసయ్య, ఆదిత్య, కృషివర్ధన్, పెద్ద గంగారం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.