
ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ వినయ్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ ఆసుపత్రిలో నారాయణ చికిత్స పొందుతున్నారు.
ఆయనకు బి నెగిటివ్ రక్తం అవసరం ఉందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన వినయ్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు.
రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.