
“మనం సైతం దేశం కోసం” అనే కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల నాగలింగేశ్వర ఆలయంలో దేశం కోసం విధులు నిర్వహిస్తున్న సైనుకులకు, రక్షణ శాఖ అధికారులకు, ప్రధాని మోడీజీకి మరింత శక్తినివ్వాలని, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడంలో భారత సైనుకులు విజయం సాధించాలని స్వామివారిని వేడుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
కలిగొట గంగాధర్ మాట్లాడుతూ : పహాల్గంలో హిందువులు అని నిర్ధారణ చేసి మరి భార్యల ముందు భర్తలను చంపడం గోరమని పొరుగు దేశం అయిన పాకిస్థాన్ ఉగ్రవాధులను పోషిస్తుందన్నారు. తగిన బుద్ధి మోడీజీ నాయకత్వం లో మొన్న చెప్పడం జరిగిందని, ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించినట్లే పాకిస్థాన్ తో యుద్ధంలో కూడా విజయం సాధించాలని, మనం సైతం – దేశం కోసం కార్యక్రమంలో కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న అర్ముర్ వాసి శ్రీ రామ్ మోహన్ రావు పటేల్ గారి కుటుంబం సోదరమణి రినీత మరియు కుటుంబ సభ్యులు సంతోష్ కుమార్, సందీప్ లు పాల్గొని సైనుకుల యోగ క్షేమల గురించి భగవంతున్ని వేడుకోవడం చాలా సంతోషం..
“మోడీజీ ఆప్ ఆగే బాడో హం ఆపకే సత్ హై ” అని భక్తులు, ప్రజలు ముందుకు రావడం దేశం పట్ల ఉన్నా భక్తిని సూచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైనికుడు రామ్ మోహన్ రావు కుటుంబ సభ్యులకు భక్తులకు కులసంఘాల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు అంబికా రమేష్, రాజయ్య, అజయ్, నారాయణ, సర్వసమాజ్ మాజీ అధ్యక్షులు సడక్ మోహన్, సడక్ గంగాధర్, భక్తులు పుప్పాల రాజేందర్, కుకునూర్ లింగన్న, బోడమిది భజన్న,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.