
ఆర్మూర్ పట్టణంలో బుధవారం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్ మాట్లాడుతూ బుద్ధ భగవానుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బుద్ధ పౌర్ణమి నాడు ముందుకు వేసే ప్రతి అడుగులో ప్రశాంతత, ప్రతి ఆలోచన జ్ఞానవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.