
మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం “నర్సింగ్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్, డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ నర్సులు పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. నర్సులు తమ వంతు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.