
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సిరికొండ గ్రామములో ఈరోజు గొల్ల, కురుమల ఆధ్వర్యంలో బీరప్ప కామ రాతి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ… బీరప్ప పండగను ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటామని, ఈరోజు కళ్యాణ మహోత్సవం, గొర్లను గావు పట్టడం జరుగుతుందని అనంతరం అన్న సత్రం,సాయంత్రం బీరప్ప కథ, ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని గొల్ల కురుమల సంఘ సభ్యులు తెలిపారు.