
వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వేల్పూరు హిందూ యువజన సంఘాల నాయకులు RI కి మదర్సా స్కూల్ పై వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మదర్సా స్కూల్ ను ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారని, స్కూలుకు ఎంఈఓ లేదా డీఈవో పరిమిషన్ ఇచ్చారా, ఒకవేళ ఇస్తే.. వాటి కాపీలు మాకు ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద మెమొరాండం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. దేశవ్యాప్తంగా మదర్సా లను తీసి వేస్తున్నారని వేల్పూర్ లో కూడా తొలగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ యూత్ అధ్యక్షుడు సుధాకర్, కమలేష్, యువజన సంఘాల నాయకులు నర్సారెడ్డి, అన్వేష్, శ్రీకాంత్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.