
ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 32వ వార్షికోత్స వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు స్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు ఎస్డిఎఫ్ ద్వారా ఐదు లక్షలు నిధులను మంజూరు చేసిన ప్రోస్డింగ్ కాపీలను ఆలయ వ్యవస్థాపకులు గడ్డం సంజీవ్ రెడ్డి, గడ్డం శ్యాంసుందర్ రెడ్డి లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతి రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు భూపేందర్, చిట్టి రెడ్డి, పురుషోత్తమ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.