జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నవయాన బుద్ధిస్ట్ సొసైటీ, బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు మాన్యవార్ వామన్ మేశ్రం, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మాన్యశ్రీ గద్దర్ కూతురు వెన్నెల, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇత్వర్పెట్ లింగన్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ నియోజక వర్గ ఇన్చార్జి కొంతం మురళీధర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్, కార్యదర్శి కొంతం పూర్ణచందర్ లు పాల్గొన్నారు.