నేడు ప్రకటించిన CBSE పదవ తరగతి ఫలితాలలో క్షత్రియ పాఠశాల (CBSE), చేపూర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు, వరుసగా 3 సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు CBSE పదవ తరగతి ఫలితాలలో మంచి ఫలితాలతో ఉత్తీర్ణతను పొందుతున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇట్టి కృషికి దోహదపడిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మి నారాయణ, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, అక్షయ్ మరియు పరీక్షిత్ పాల్గొన్నారు.