నిజామాబాద్ లోని కలెక్టర్ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రతినిధులతో జిల్లా న్యాయమూర్తి భారత లక్ష్మీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ప్రతినిత్యం సమాజంలో కానీ కుటుంబంలో కానీ అనేక చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయని వాటిని సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు పోవాలని సూచించారు. నేటి కాలంలో ప్రతి చిన్న సమస్యను పెద్దగా చేసి పోలీస్ స్టేషన్, కోర్టు వెంట తిరగడం, సమయాన్ని డబ్బులు వృధా చేయడం లాంటి తప్పులు చేయకూడదని సూచించారు. సమస్యలను సులువుగా మీడియేషన్ కమ్యూనిటీ సెంటర్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చని అదేవిధంగా వారి యొక్క సమస్యలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ మీడియేషన్ ద్వారా ఇప్పటికి సుమారు 26 కేసులు దాకా అందులో 12 కేసులను పరిష్కరించగా మిగతా పది కేసులు రన్నింగ్ లో ఉన్నాయని నాలుగు కేసులు వాపాస్ కావడం జరిగిందని ఆర్మూర్ మీడియేషన్ ప్రతినిధులు బాబా గౌడ్, లయన్ నివేదన్ గుజరాతి mjf లు పేర్కొన్నారు. అనంతరం న్యాయమూర్తిని ఆర్మూర్ మీడియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్చం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డిసిపి బస్వారెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, DLSA సెక్రటరీ ఉదయభాస్కర, ఆర్మూర్ RDO రాజాగౌడ్, ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ప్రతినిధులు శంకర్ గౌడ్ నారాయణ వర్మ అశోక్ జిల్లా పోలీసు అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు.