
తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణ శివారులో గల ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు BRS పార్టీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న RDO రాజాగౌడ్ రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ RDO రాజా గౌడ్ అన్నారు. రాత్రి వర్షం కురవడంతో ధాన్యం తడిచిపోయినట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ గౌడ్, తదితరులు ఉన్నారు.