
ఆర్మూర్ పట్టణంలోని మర్కజ్ కమిటీ భవనంలో మర్కజ్ కమిటీ అధ్యక్షులు మొయినుద్దీన్, రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ బషీరుద్దీన్, అకాడమిక్ కో ఆర్డినేటర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం తెలంగాణ మైనార్టీ ఆర్మూర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ నహిదా ఫిర్దోస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ పాఠశాలలో రాష్ట్రస్థాయి ర్యాంకుల సాధించిన విద్యార్థులను అభినందించారు. సభ్యులందరూ అడ్మిషన్ల కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మైనార్టీ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పరిచి వారిలో ఈ సొసైటీ అందిస్తున్న సదుపాయాలను గురించి అవగాహన కల్పిస్తామన్నారు. బస్తీ ప్రదేశాలలో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు వచ్చి అవగాహన కల్పించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ బాయ్స్ ప్రిన్సిపాల్ యోగేష్, ఆర్మూర్ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ అతిక్, సెక్రటరీ రెహమాన్, సభ్యులు తాజా మాజీ వైస్ చైర్మన్ మున్ను, ఫయాజ్, ఇంతియాజ్, అతిక్, TGMRS ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.