
భీమ్ గల్ మండలం పురాణీపేట్ గ్రామానికి చెందిన బడుగు బలహీనవర్గాల యువ నాయకుడు, ఆపద వచ్చిన వెంటనే స్పందించి తగిన న్యాయం చేసే మంచి మనసున్న జన నాయకుడు *దైడి సురేష్*. ఫార్మసీ ఉన్నత విద్య అభ్యసించాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అందరితో కలుపుకొని పోయే స్నేహ స్వభావం కలిగిన వ్యక్తి. సామాజిక బాధ్యత గుర్తెరిగి మీడియా ప్రతినిధిగా సమాజంలో అందరితో సోదరా భావంతో ఉంటూ సన్నిహితంగా కలుపుగోలుతనంతో జన సమేతంగా ఉంటూ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మీడియా పరంగా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరేవేయటంలో ముందంజలో నిలుస్తాడు. ఇంతకుముందు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ శివన్నోళ్ల శివకుమార్,మల్లెల గణేష్ నేతృత్వంలో కలిసి పనిచేశాడు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిన ఎంపిటిసి, జడ్పీటిసి మరియు సర్పంచ్ అభ్యర్థులు గెలవడానికి ప్రచారంలో ముందుండి గెలిపించాడు. ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అందించిన పథకాలు విద్యార్థులకు, నిరుపేదలకు, యువకులకు నిరుద్యోగులకు తన వంతుగా సహాయం అందే విధంగా కృషి చేశాడు. పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్షల అట్టలు మరియు ఉచిత బియ్యం పంపిణీ తన సొంత ఖర్చులతో వితరణ చేశాడు.
కరోనా మహమ్మరి సంభవించినప్పుడు 2020-2021 సునీల్ యువసేన భీమ్ గల్ మండలం ఇంఛార్జి గా కొనసాగి అన్ని గ్రామాల్లో క్వారంటైన్ ఉన్న ఇళ్లల్లో కరోనా పాజిటివ్ ఉన్న ప్రతి వ్యక్తి ఇంటికి 14 రోజులకు సరిపడే నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసి అందరికీ ధైర్యం చెబుతూ చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ సమావేశాలకు తు.చ తప్పకుండా పాల్గొంటూ, కార్యకర్తలకు ప్రేరణ కలిగిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించుటకు అలుపెరుగని కృషి చేశాడు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ, సొంత ఇంటి బియ్యం సైతం అందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న వితరణశీలి. ఏ పదవి లేకుండా ఏమీ ఆలోచించకుండా నిస్వార్ధంగా పనిచేసిన దైడి సురేష్ ను పార్టీ గుర్తించి భీమ్ గల్ మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని మండలంలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు.