
ఆర్మూర్ పట్టణంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ హాజరై మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా సంభవించే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు బోధకాలు ఇలాంటి వ్యాధులపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది తెలిపారు. మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దోమతెరలు వాడాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రతి మంగళ శుక్రవారం ఇంటింటికి తిరిగి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్, సబ్ యూనిట్ అధికారి సాయి, సూపర్వైజర్ శాంత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, రాజవ్వ కమల శ్యామల స్వాతి విజయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.