
భీంగల్ మండలం పురానిపేట్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఎంపీడీవో సంతోష్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఎంపీఓ జావిడ్ అలీ లు శుక్రవారం భూమి పూజ చేసి మార్కౌట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సీరం అను సాగర్, దైడి.సురేష్, తోట శివ క్రాంతి, కైరా.అశ్విని, ఎల్లోల సాయమ్మ, గ్రామ యువకులు బరుకుంటా సుధాకర్, పత్రి సతీష్ మరియు పంచాయతీ సెక్రెటరీ జితేందర్, కరోబార్ ప్రశాంత్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా నెరవేరబోతున్నందుకు, ఇందుకుగాను ఇండ్లు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.