
సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.