TPCC అధ్యక్షుడు & MLC మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఆర్మూర్ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పెర్కిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్, కార్యదర్శి మున్షి లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు సమస్యలను ఆయన ముందు ప్రస్తావించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, తాజా మాజీ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, తాజా మాజీ వైస్ చైర్మన్ షేఖ్ మున్ను, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ నాయీమ్ తదితరులు ఉన్నారు.