నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయ యంత్ర మూర్తి, శిఖర ధ్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన స్వామివారి దర్శనం చేసుకొని పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం, మాన్పూర్ భూమేశ్వర్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, సీనియర్ నాయకులు మారుతి రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.