
భీమ్ గల్ మండలం గోనుగోప్పుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ ముగ్గు పూసే కార్యక్రమాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేర్చాలనే అంకితభావంతో కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు అత్యంత పేదవాళ్లకు అర్హులైన కుటుంబాలకు కులమత పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ ఇల్లు నిర్మించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.