ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన సుఖం రాజగంగు కు 13వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని, అనారోగ్యం బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేస్తూ పేదవారికి ప్రభుత్వం ఎంతో ఆసరాగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్రీకాంత్, AMC వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.