
భీంగల్ పట్టణంలోని గంగారపు సంఘం ఆధ్వర్యంలో కొలువై ఉన్న నరసింహ స్వామి వారి 21వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నరసింహ స్వామి వారికి వేద పండితులచే మంగళారతులతో, డప్పు చప్పులతో, మేళా తాళలతో, భక్తి పాటలతో శోభయాత్ర నిర్వహించగా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితులు రఘు ఆలయం దగ్గర యజ్ఞం, ఘనంగా నిర్వహించారు. తదనంతరం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక హారతి, పూజలు నిర్వహించారు. దాదాపుగా 2000 మందిపైగా భక్తులు పాల్గొనగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మనుషులు పీక లింబాద్రి, గంగారపు నరసయ్య, లింబన్న, సంఘం సభ్యులందరూ తదితరులు పాల్గొన్నారు.