
బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు & జిల్లా అధ్యక్షుడు యాసాడ నర్సింగ్ ముదిరాజ్ అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటె రాజేందర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కబాడతారని జగ్గారెడ్డిని వారు హెచ్చరించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈటెల రాజేందర్ మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో BJP అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన జిల్లా అధ్యక్షుడు మందుల బాలు, తదితరులు ఉన్నారు.