TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివాహ దినోత్సవం సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ లతో కలిసి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్, నాయకులు మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.