ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రమేష్ పాల్గొని మాట్లాడుతూ హైపర్ టెన్షన్ ద్వారా వచ్చే అనర్ధాలు వాటి నివారణ గురించి ఆశలు మరియు వైద్య సిబ్బందికి తగు సలహాలు సూచనలు చేశారు. మీ రక్తపోటును కచ్చితంగా కొలవండి… దానిని నియంత్రించండి…. ఎక్కువకాలం జీవించడని అన్నారు. రక్తపోటును తగ్గించడానికి వివిధ చిట్కాలు ఉన్నాయని వాటిని పాటించాలని సూచించారు. ఆహారంలో ఎక్కువ పొటాషియం మరియు తక్కువ సోడియం తీసుకోవడం, ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలని, అధిక ఒత్తిడిని తగ్గించాలని సూచించారు. తగినంత ఆరోగ్యకరమైన అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్ సబ్ యూనిట్ అధికారి సాయి హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ ఫార్మసిస్టు సురేష్ కృష్ణ స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.