నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు అడ్మిషన్లు చేస్తేనే టీచర్లకు జీతాలు ఇస్తామని యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని USFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దాల నాగరాజ్, పెద్ది సూరి అన్నారు. పలువురు టీచర్లు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ఆయా కాలనీలలో అడ్మిషన్ల కోసం తిరుగుతున్నారని, అడ్మిషన్లు లేకపోతే తమకు ఒక నెల జీతం ఇవ్వరని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టడంతో సెలవులు ఉన్నప్పటికీ అడ్మిషన్ల కొరకు కాలనీలలో తిరుగుతున్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అడ్మిషన్లు ఇస్తేనే జీతాలు ఇస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం పట్టించుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ పాల్గొన్నారు.