
బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో బోధించే మండల స్థాయి ఉపాధ్యాయులకు ఈనెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలతో హాజరుకావాలని సూచించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులకు హాజరు శాతం 100% ఉండాలని ఆయన పేర్కొన్నారు.