
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అధితులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఐత్వర్పేట్ లింగన్న, ఆర్మూర్ నియోజక వర్గ ఇన్చార్జి కొంతం మురళీధర్, హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ, ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట ప్రతి రోజు దళితులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి అన్నారు. నిర్మల్ జిల్లాలోని ఘోరంచ గ్రామంలో బుద్ధ జయంతి రోజు బుద్దుని విగ్రహం పెట్టి బుద్ధ పూర్ణిమ మహోత్సవం జరుకుంటే దళితులపై దౌర్జన్యాలు చేసి వారిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. అలాగే మొన్నటికి మొన్న కాళేశ్వరం వద్ద నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు దళిత పెద్దపల్లి ఎంపీ గుడిసెల వంశీ కృష్ణ కు కనీస ఆహ్వానం అందలేదని అన్నారు. దళిత ఎంపీ అయినందుననే ఆయనకు ఆహ్వానం అందలేదన్నది నిజం కాదా అన్నారు. కనీసం ఇప్పటికైనా మా దళితుల పట్ల చిన్న చూపు తగదని హెచ్చరించారు. ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పుష్కరాల సెక్రటరీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి కొంతం పూర్ణ చందర్, సభ్యులు వెన్న రమేష్, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.