
ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ జన్మదిన సందర్భంగా ఆయనకు నమస్తే ఇందూరు తెలుగు దినపత్రిక ఎడిటర్ సుంకరి గంగా మోహన్, సుదినం తెలుగు దినపత్రిక ఆర్సి రిపోర్టర్ లిక్కి శ్రావణ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా విద్యావంతులకు మంచి విద్యను వైద్యం అందించే విధంగా తమ సహకారం అందించాలని కోరారు.