
ఆదివారం ఆర్మూర్ పట్టణంలో గల శ్రీరామ కాలనీలో ఆర్మూర్ ఏరియా ప్రముఖ చార్టెడ్ అకౌంట్, ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ 50వ జన్మదినం సందర్భంగా వారి ఇంటి వద్ద వారి మిత్ర బృందం మరియు ఆర్మూర్ పట్టణ ప్రముఖులు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వారి మిత్రులు వెస్ట్రన్ కల్చర్ కేక్ కు బదులు రైతులు పండించే పుచ్చకాయ *(వాటర్ మిలన్)* ను కట్ చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుచ్చకాయ కట్ చేయించే కార్యక్రమంలో ఆర్మూర్ బిజెపి మున్సిపల్ ఫోర్ లీడర్, చార్టెడ్ అకౌంట్ రాజశేఖర్ మిత్రుడు, నరసింహారెడ్డి, బ్లూ బర్డ్స్ విద్యాసంస్థల చైర్మన్ రఫీక్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు అర్గుల్ సురేష్ ప్రముఖ ప్రాతికేయుడు, పుట్టి మురళి, సర్వే రాజు, రిపోర్టర్ లు సందీప్, సుదర్శన్, చేతన్, క్రాంతి, సాయి, అనీఫ్ తదితరులు చార్టెడ్ అకౌంట్ మిత్రులు పుచ్చకాయ కట్ చేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చార్టెడ్ అకౌంట్, ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉదయం నుండి నా జన్మదిన సందర్భంగా ఆర్మూర్ పట్టణ, ఆర్మూర్ సబ్ డివిజన్ మరియు వివిధ జిల్లాల నుండి నాకు శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రైతులపై ప్రేమతో రైతులు పండించే ధరలకు గిట్టుబాటు ధర రావాలని నా మిత్రులు నాతో వెస్టన్ కల్చర్ కేకు కాకుండా రైతులు పండించే పుచ్చకాయ కట్ చేయించి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ రైతులు పండించే పండ్లు ఫలాలు, వేసవి కాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చకాయలతో జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.