
పేదలకు అండగా ఉంటా..
-విద్య, వైద్య రంగాల్లో సేవ చేస్తా..
-సమాజానికి మంచి మేధావి అవసరం ఉంది..
-నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరవత్రి రాజశేఖర్ జన్మదిన వేడుకలు..
ఆర్మూర్, మే 18:
తన తండ్రి కోరిక మేరకు ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆదివారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ ఆధ్వర్యంలో ఈరవత్రి రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మనకు ఇచ్చిన దాంట్లో కొంత పొందే అర్హత ఉంటుందన్నారు. సంపాదించిన డబ్బులో కొంతమేర బడుగు బలహీన వర్గాలకు వీలైనంత సేవ చేస్తానన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా తండ్రి రాందాస్ కోరిక మేరకు విద్య, వైద్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు సహాయ సహకారాలు అందించడానికి అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానన్నారు. తాను అందరి సహకారంతో సహాయ సహకారాలు చేయడం మంచి అవకాశంగా భావిస్తున్నానన్నారు. అనేకమందికి దేవుడు ఎంతో ఇచ్చిన ఇబ్బందుల్లో ఉన్న వారిని పట్టించుకోరన్నారు. తాను అలాంటి వాళ్ళ మాదిరిగా మిగిలిపోకుండా తనకున్న పరిధిలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేస్తున్నట్లు వివరించారు. జర్నలిస్టు మిత్రులు ప్రెస్ క్లబ్ లో తన జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషాన్నిచ్చిందన్నారు. అంతకుముందు ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు మిత్రులకు కేక్ ను తినిపించారు. జర్నలిస్టులు, ఫౌండేషన్ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వినోద్, కోశాధికారి గోజురు మహిపాల్, సంయుక్త కార్యదర్శి దినేష్, భవన కమిటీ సభ్యుడు పోహర్ కిరణ్, సభ్యులు సాత్ పుతే శ్రీనివాస్, విన్సెంట్, గోలి పురుషోత్తం, గట్టడి రాజ్ కుమార్, బారడ్ గణేష్, షికారి శ్రీనివాస్, సామ సురేష్, గట్ల వినోద్, గట్టడి అశోక్, వెంకటేష్ గుప్తా, లిక్కి శ్రావణ్, ఘటడి అరుణ్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రాంప్రసాద్, కొండి రాంచందర్, సడాక్ ప్రమోద్, కిట్టు, దాసరి గోపి, సత్యనారాయణ, శ్రీకాంత్ గౌడ్, నిర్మల్ క్రాంతి, పిప్రి సాయన్న తదితరులు పాల్గొన్నారు.