
సోమవారం భీంగల్ మండలం ముచ్కూర్ సొసైటీ గోదాం వద్ద సొసైటీ అధ్యక్షులు దేవేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన 50 శాతం సబ్సిడీతో జీలుగు విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు బూరెడ్డి గంగారెడ్డి, ఏఈఓ అరవింద్, కాంగ్రెస్ నాయకులు రాజు సంతోషం లింబాద్రి సొసైటీ డైరెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.