
జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ వర వేంకట లక్ష్మీ బాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగిందని VDC అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. సోమవారం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రేపటి వరకు ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం స్వామి వారి అభిషేకం, ఆవహిత మండప పూజ, నిత్య హోమం, అష్ట బలి, నిర్వహించినట్లు చెప్పారు. ఇవాళ సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించామని తెలిపారు.ఈ వేడుకలలో ఉపాధ్యక్షుడు గంగాధర్, క్యాషియర్ ప్రకాష్, ఊశన్న, గంగ గౌడ్, రవిరాజ్, పూజారి చక్రవర్తుల సుదర్శనాచారి, తదితరులు పాల్గొన్నారు.