
ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన పద్మకు 60 వేల CMRF చెక్కును వార్డు ఇన్చార్జి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ అందజేశారు. వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం CMRF చెక్కులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైతే CMRF పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ చెక్కులు మంజూరు చేయించడంలో కీలకపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్, నాయకులు బత్తుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు