
ఆర్మూర్ ప్రెస్ లో భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎలక్షన్ కమిటీ సభ్యులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి తెలిపారు. నూతన అధ్యక్షుడిగా చౌల్ సందీప్, కార్యదర్శిగా దేశెట్టి సునీల్, కోశాధికారి అజీమ్, ఉపాధ్యక్షులుగా జానా రమేష్, జాయింట్ సెక్రటరీ ఎలిగేటి చక్రధర్, ఈసీ మెంబర్లు సామ మురళి, రాచర్ల వార్ చేతన్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు చౌల్ సందీప్, దేశెట్టి సునీల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తాము అండగా నిలబడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష కార్యదర్శులు నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు గంగుల పద్మయ్య, కలిగోట్ చిన్న, జానా గౌడ్, ముత్యం, రితీష్, రాకేష్, హరికృష్ణ, యఫై, పింజ సుదర్శన్, ప్రసాద్, రాజేష్, క్రాంతి, వెంకన్న, సాయి, సాజిద్ పాల్గొన్నారు.