
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సాయంత్రం DMHO రాజశ్రీ నకిలీ ఆసుపత్రులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులు వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి కొన్ని వైద్య పరికరాలు, నకిలీ మందులు, స్వాధీన పరచుకున్నారు. ఫైల్స్, ఫిస్టులా, స్కిన్, గనేరియా, సిఫైల్లీస్, హైడ్రోసిల్, ఫీషర్, వంటి రోగాలకు చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కలకత్తా నుండి వచ్చి ఇక్కడ ఆసుపత్రులను నడుపుతున్న వీరు కనీసం ఇంటర్ కూడా పాస్ అవ్వని వారు డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని DMHO రాజశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై ఉక్కు పాదం మోపుతామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. నకిలీ మందులను, వైద్య పరికరాలను, నాలుగు ఆసుపత్రులను సీజ్ చేయడం జరిగిందని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ దాడుల్లో డిప్యూటీ డీఎంఎచ్ఓ డాక్టర్ రమేష్, మెడికల్ సర్వేయర్ డాక్టర్ నాగరాజు, సాయన్న, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, వైద్యశాఖ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.
https://youtu.be/qidJQgIhuQ8?si=1pJ4w-RGVeIFmC_N