
ఆర్మూర్ పట్టణం యోగేశ్వర కాలనీ 25వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఐదు లక్షలు మంజూరు అయినా లబ్ధిదారులు గడ్డం సువర్ణకి మంజూరు పత్రం ఇచ్చి మార్కింగ్ చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు భూపేందర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు భూపేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొని పేదవారి సొంత ఇంటి కల సహకారం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఐదు లక్ష రూపాయల మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్, సంతోష్, వాడు ఆఫీసర్ సింధు, నాగరాజు, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.