
CDMA ఆదేశాల మేరకు సర్క్యులర్ నెంబర్ 190459/2020/25 ప్రకారం భీంగల్ పట్టణంలోని ఇంటి నెంబర్లు లేని మరియు నూతనంగా ఇంటిని నిర్మించుకొని ఇంటి నెంబర్ తీసుకొని వారికోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. మున్సిపాలిటీ సిబ్బంది మీ ఇంటికి వచ్చి వారు వారి ఇంటి కొలతలు తీసుకొని ఇంటి నెంబర్లు ఇవ్వడం జరుగుతుందని కమిషన్ పట్టణ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో వార్డులో ఇంటి నుండి కొలతలు తీసుకుంటున్న బృందాలను కమిషనర్ తనిఖీ చేశారు. పట్టణంలో తిరుగుతున్న ప్రజలకు మీ ఇంటి డాక్యుమెంట్లు పర్మిషన్ పత్రాలు ఇచ్చి సహకరించాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
https://youtu.be/8TCCvChh_BU?si=12N58NzOPbXBZL5M