తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదేశానుసారం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సు డ్రైవర్లు – ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలు – రోడ్డు భద్రతా పైన అవగాహన సదస్సు రేపు ఉదయం 9 గంటలకు ఆర్మూరు మున్సిపల్ పరిధి పేర్కిట్ కోటార్మూర్ లోని GR గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడుతుంది. ఈ సదస్సు లో ఆర్మూర్ మండలంతో పాటు బాల్కొండ, భీమ్ గల్, జక్రాన్ పల్లి, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల, ఆలూరు, డొంకేశ్వర్ మండలాల ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మరియు వారి బస్సు డ్రైవర్లు, క్లీనర్లు తప్పకుండా హజరు కావాలని ఆర్మూర్ MVI వివేకానంద్ రెడ్డి మరియు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య, సెక్రెటరీ విద్య ప్రవీణ్ పవార్, మరియు రాష్ట్ర బాధ్యులు కాంతి గంగారెడ్డి , శ్రీ భాషిత సుందర్, మనసా గణేష్ లు హాజరవుతున్నారని తెలిపారు.