ఆరు రోజుల్లోనే నాట్యాన్ని నేర్చుకొని.. తొలి ప్రయత్నంలోనే అబ్బురపరిచిన చిన్నారి జయరెడ్డి.. నృత్య ప్రదర్శన..
ఆర్మూర్ ప్రాంతంలో చిన్నారి జయ రెడ్డికి పలువురు ప్రముఖుల అభినందనలు..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి జయరెడ్డి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన చేసి అందరిని అబ్బురపరిచింది. కేవలం నాట్యాన్ని 6 రోజుల్లోనే నేర్చుకొని తొలి ప్రయత్నంలోనే రవీంద్ర భారతిలో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలో అందరి మన్ననాలను అందుకొని జయ రెడ్డి శభాష్ అనిపించుకుంది. కేవలం 8 ఏళ్ల చిన్నారి చిచ్చరపిడుగు వలె 6 రోజుల్లోనే నాట్యాన్ని నేర్చుకొని రాష్ట్రంలో అద్భుత కళావేదికైన రవీంద్రభారతి వేదికగా అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ చిన్నారి జయరెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.. తనయ, ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి ఏకైక కూతురు. ఈ చిన్నారి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వయాన మనవరాలు అవుతుంది. ఈ చిన్నారి రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శనలో అద్భుత ప్రదర్శన కనబరిచి పలు మెమొంటోలను తొలి ప్రయత్నంలోనే అందుకోవడంతో ఆర్మూర్ ప్రాంతంలోని పలు రంగాల్లోని ప్రముఖులు ప్రత్యేకంగా పలు సోషల్ మీడియా విభాగాల్లో అభినందనలు తెలుపుతున్నారు.